కొరుక్కుపేట: లంచం తీసుకున్నాడన్న ఫిర్యాదులతో ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ప్రవేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన విజయకుమార్ ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరునల్వేలి సిటీ, తూత్తుకుడి, మదురై, విరుదునగర్ జిల్లాల్లో పనిచేశారు. 2019లో పెరుమాళ్ పురం పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. అప్పట్లో ఓ ప్రైవేట్ వైద్యుడి నుంచి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నైల్లె జిల్లా అవినీతి నిరోధక శాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. ఆ తర్వాత 2021లో తూత్తుకుడి జిల్లాకు బదిలీ అయ్యారు. 2022 నుంచి కలగుమలై పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, తిరునల్వేల్లి అవినీతి నిరోధక పోలీసుల నివేదిక, పెండింగ్ ఆరోపణల ఆధారంగా ఇన్‌స్పెక్టర్ విజయకుమార్‌ను తిరునల్వేలి డీఐజీ ప్రవేశ్‌కుమార్ సస్పెండ్ చేశారు.