తిరువళ్లూరు: సుమారు రూ.65 లక్షల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించిన వ్యవహరంలో పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చే శారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె కోవూరు ప్రాంతాని కి చెందిన మదివానన్ భార్య విద్య(35)కు మదనంతపురం మాఽతానగర్‌లో 1900 చదరపు అడుగుల స్థలాన్ని రూ.65 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే విద్య కొనుగోలు చేసిన స్థలం రిజి స్ట్రేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుబ్బరాయుడు అనే వ్యక్తి ఫి ర్యాదు చేశారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ భూమికి సంబంధించిన అఽన్ని ఽఆధారాలతో విచారణకు రావా లని విద్యకు నోటీసులిచ్చారు. దీంతో విద్య విచారణకు హాజరయ్యారు. దీంతో ఆమెను విచారణ జరి పి, ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, భూమిని విక్రయించినట్టు తెలిసిన విద్య షాక్‌కు గురయ్యారు. తాను మోసపోయామని గు ర్తించిన విద్య ఈ విషయమై ఆవడి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆవడి కమిషనర్ శంకర్, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇన్‌స్పెక్టర్ జయశంకర్‌ను ఆదేశించారు. వి చారణలో అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అలియాస్ ప్రియన్‌కుమార్(32) మరికొంత మంది సు బ్బరాయుడు పేరుపై ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి విద్యకు విక్రయించినట్టు నిర్ధారించి గాలింపు చర్యలు చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహుల్ అలియాస్ ప్రియన్‌కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరి కొంత మంది కోసం గాలిస్తున్నారు.