తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తండ్రి, కుమారుడిపై కత్తితో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. చైన్నె ఓటేరి మెట్టుపాలయం వీరరాఘవ వీధికి చెందిన కామేశ్వరరావు (55)కు కు మార్తె మణిమాల, కుమారుడు దేవకుమార్ ఉన్నా రు. మణిమాలకు వివాహమైంది. ఆయితే ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మేట్టుపాలయం వెపేరి అమ్మన్ ఆలయ వీధికి చెందిన మురుగన్ (36)తో మణిమాలకు పరిచయమైంది. ఈ క్రమంలో వీద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కామేశ్వరరావు, తన కుమారుడు దేవకుమార్‌తో కలిసి మురుగన్ ఇంటికి వెళ్లి అతడిని ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన మురుగన్ ఇంట్లోని కత్తి తీసుకొచ్చి తండ్రీకొడుకులపై దాడి చేశాడు. ఇద్దరికీ తీవ్ర గా యాలు అయ్యాయి. క్షతగాత్రులను కీల్పాకంం ప్రభుత్వాసత్రిలో చేర్చారు. ఈ విషయమై కామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మురుగన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపారు.