అర్ధరాత్రి ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ

Sep 3 2023 2:02 AM | Updated on Sep 3 2023 1:32 PM

లారీ ఢీకొనడంతో కూలిన గోడ  - Sakshi

లారీ ఢీకొనడంతో కూలిన గోడ

అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వేలూరు: అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి నుంచి కట్టల లోడ్డుతో లారీ శుక్రవారం రాత్రి బయలుదేరింది. సేతుపట్టు సమీపంలోని నంబేడు వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని అతివేగంగా ఢీకొంది.

ఆ సమయంలో ఇంటిలో గాఢనిద్రలో ఉన్నవారిపై గోడలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో మునియప్పన్‌, భార్య జయలక్ష్మి, కుమారుడు ఏయుమలై, కోడలు సుగన్య ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేతుపట్టు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement