కర్ణాటక మద్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక మద్యం స్వాధీనం

Aug 17 2023 1:58 AM | Updated on Aug 17 2023 12:32 PM

- - Sakshi

అన్నానగర్‌: వాణియంబాడి సమీపంలో మంగళ వారం రాత్రి కారుతో పాటు కర్నాటక రాష్ట్ర మద్య బాటిళ్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి లిక్కర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డివిజన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జయలక్ష్మి ఆధ్వర్యంలో చెట్టియప్పనూర్‌ జంక్షన్‌ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ కారును పోలీసులు ఆపేందుకు యత్నించారు. అప్పుడు డ్రైవర్‌ కారును ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు కారును సోదా చేయగా అందులోని 1,248 కర్ణాటక రాష్ట్ర మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement