ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌.. ఎంత తాగాడో తెలుసా?

Man Dies After Seven Bottles Of Liquor On Livestream - Sakshi

సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్‌ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్‌ స్ట్రీమింగ్‍లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు!

చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్‌ 'డౌయిన్'(చైనా టిక్‌టాక్)‍లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు.

వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్‌లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్‌లో భాగంగా లైవ్‌లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‍లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా.

మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్‌లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరాడని తెలిపాడు. 

'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్‌ఫామ్‌లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది.

ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్‌లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top