
తమిళ సినిమా: కథానాయకలు బికినీ దుస్తుల్లో అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు. అలా అగ్ర కథానాయికగా రాణిస్తున్న నయనతార కూడా ఇంతకుముందు బికినీ దుస్తుల్లో ప్రేక్షకులకు కనువిందు చేశారు. అజిత్ సరసన నటించిన బిల్లా, విజయ్‌తో జతకట్టిన విల్లు చిత్రాల్లో ఈ భామ అందాల మోత మోగించారు. కాగా ప్రస్తుతం నయనతార బాలీవుడ్లో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి జవాన్ అనే టైటిల్ నిర్ణయించారు. దీన్ని కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
కాగా షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటించిన హిందీ చిత్రం పఠాన్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో దీపిక పదుకొనే శృతిమించి బికినీ దుస్తుల్లో అందాలు ఆరబోసి నటించిందనే విమర్శలను ఎదుర్కొంది. అయితే ఆ చిత్రాన్ని ఆమె అందాల కోసమే కుర్రకారు ఇరగబడి చూశారనే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా బాలీవుడ్లో హీరోయిన్లు బికినీ దుస్తుల్లో నటించటం పరిపాటే. ఒకప్పుడు హాలీవుడ్లో ఆ తర్వాత బాలీవుడ్‌లో ఉన్న ఆ సంస్కృతి ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ వ్యాపించింది.
నయనతార నటిస్తున్నది హిందీ చిత్రం కావడంతో జవాన్‌లోనూ ఆమె బికినీ దుస్తుల్లో నటిస్తున్నట్లు తాజా సమాచారం. అప్పట్లో బిల్లా చిత్రంలో బికినీ దుస్తుల్లో నటించిన నయనతార చాలా గ్యాప్ తర్వాత అదీ పెళ్లయిన తర్వాత కూడా యువతను అలరించడానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే జవాన్ చిత్రంలో నయనతార బికినీ దుస్తుల్లో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.