
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న కొత్త సినిమా 'డియర్ స్టూడెంట్స్' నుంచి టీజర్ విడుదలైంది. మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ నటిస్తున్న ఈ చిత్రాన్ని జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నివిన్, నయన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆసక్తిగానే ఉంది.
నయనతార, శింబు లీడ్ రోల్స్‌లో నటించిన ‘వల్లభ’ (2006) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్ వల్లభ (శింబు),ప్రోఫెసర్ స్వప్న (నయనతార) ప్రేమించుకుంటారు. ఇప్పుడు ‘వల్లభ’ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథలా డియర్ స్టూడెంట్ ఉంది.