తుంగతుర్తి, అర్వపల్లి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మాదిరిగానే కేరళ రాష్ట్రంలోనూ భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం ఉద్యమించి స్ఫూర్తిని చాటుతామని ఆ రాష్ట్రానికి చెందిన సీపీఎం బృందం సభ్యులు అన్నారు. పోరాటాల పురిటి గడ్డ అయిన తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపమాడ్ గ్రామాన్ని గురువారం కేరళ రాష్ట్రానికి చెందిన సీపీఎం ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం విగ్రహాలతోపాటు కాసర్లపహాడ్లో సాయుధ పోరులో ప్రాణాలర్పించిన 18మంది అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు వచ్చిన కేరళ ప్రతినిధులు ఆయా గ్రామాలను సందర్శించారు. అనంతరం వారు తెలంగాణ పోరాట యోధుల స్మరించుకున్నారు. వారి త్యాగాలను కొనియాడారు. తర్వాత కాసర్లపహాడ్లో స్థానికులతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా కేరళ ప్రతినిధుల బృందానికి కాసర్లపహాడ్ గ్రామ సర్పంచ్ మంచాల లలితరాంమ్మూర్తి ఆధ్వర్యంలో సన్మానం చేశారు.కార్యక్రమంలో కేరళ ప్రతినిధులు ప్రకాష్ మాస్టర్, మాజీ ఎమ్మెల్యే ఎంసీ పవిత్రన్, షకీనా, జోసెఫ్, గోవిందం, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, స్థానిక నాయకులు బుర్ర శ్రీనివాస్, వజ్జె శ్రీనివాస్, శిగ వెంకన్న, విజయ్, నర్సయ్య, సైదులు, శ్రీవిద్య, తాటి విజయమ్మ, పల్లా సుదర్శన్, పాల బిందెల జానయ్య, ఉప్పుల సోమయ్య, మరిపెద్ది యాదగిరి, మిట్టగడుపుల లచ్చయ్య, కందుకూరి చంద్రయ్య పాల్గొన్నారు.
కొత్తగూడెం, కాసర్లపహాడ్ గ్రామాల్లో
కేరళ ప్రతినిధుల బృందం సందర్శన


