‘వంటా వార్పు’లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

‘వంటా వార్పు’లో భాగస్వాములు కావాలి

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్‌ రైలు, రైల్వే కారిడార్‌ సాధనకు జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉద్యమ కమిటీ సభ్యులు కోరారు. గురువారం స్థానిక హోటల్‌ శ్రీ గ్రాండ్‌లో జరిగిన అఖిలపక్ష ఉద్యమ సన్నాహక కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈనెల 21న పట్టణంలో నిర్వహించే వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 8 గంటల నుంచే వంటా వార్పు కార్యక్రమం ప్రారంభించాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రధాన రహదారుల వెంట ఈ వంటావార్పు కార్యక్రమాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెంటర్ల వారీగా వంటావార్పు పర్యవేక్షణ కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోకన్వీనర్లు, పెద్దిరెడ్డి రాజా, సలహాదారు రమణాచారి,ఽ ధర్మార్జున్‌, నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, చల్లమల్ల నరసింహ, బండారి డేవిడ్‌ కుమార్‌, కొత్తపల్లి శివకుమార్‌, వెలుగు వనిత, అనంతుల మధు, భూపతి రాములు, మట్టిపల్లి సైదులు, గంట నాగయ్య, సకినాల కృష్ణ, జీడి భిక్షం, పందిరి మాధవరెడ్డి, జలగం మల్లేష్‌, నేరెళ్ల మధు, ఎరకచర్ల శోభారాణి, విజయమ్మ, సట్టు నాగయ్య, పోలెబోయిన కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement