భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం ధాన్యం పొటెత్తింది. దాదాపు 63,518 బస్తాల (41,286 క్వింటాలు) ధాన్యాన్ని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. ఈ సీజన్‌లో అత్యధికంగా ధాన్యం రావడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 26న రికార్డు స్ధాయిలో 71వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఈ తర్వాత సోమవారం భారీగా ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఇందులో బీపీటీ సన్నాలు 31,609 బస్తాలు ఉండగా, జైశ్రీరామ్ 26,703 బస్తాలు విక్రయానికి వచ్చాయి. అత్యధికంగా బీపీటీ రకానికి క్వింటాకు రూ.3001 ధర పలకగా.. కనిష్టంగా రూ.2201 ధర వచ్చింది. జైశ్రీరామ్
రకానికి క్వింటాకు గరిష్ట ధర రూ.4169 ఉండగా, కనిష్ట ధర రూ.2209ల ధర పడింది.
నేడు మార్కెట్‌కు
సెలవు
చివరి దశ వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ట్రాక్టర్లు ధాన్యం లోడులతో క్యూ కట్టాయి. చాలావరకు వడ్ల కొనుగోలు పూర్తయిన మిల్లులకు తరలింపు రాత్రికి రాత్రి సాధ్యపడని క్రమంలో మంగళవారం యార్డుకు అధికారులు సెలవు ప్రకటించారు.


