విద్యార్థుల ఖాతాల్లో రవాణా భత్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఖాతాల్లో రవాణా భత్యం

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

సూర్యాపేటటౌన్‌ : పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు సమీప గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సిన వస్తుంది. వ్యవసాయ కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు రోజూ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం ఆర్థిక భారంగా మారుతోంది. దీంతో కొందరు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ప్రయాణ ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ రవాణా భత్యం అందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అర్హులైన 689 మంది ఖాతాల్లో మూడు నెలలకు సంబంధించి నెలకు రూ.600 చొప్పున ఒక్కో విద్యార్థికి రూ.1,800 వారి ఖాతాల్లో జమ అయ్యాయి.

75 శాతం హాజరు తప్పనిసరి

ఒక కిలోమీటరు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఇతర గ్రామాల పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అయితే, విద్యార్థులకు పాఠశాలలో కనీసం 75 శాతానికి పైగా హాజరు ఉండాలి. వారి పేరిట లేదా తల్లిదండ్రులతో కలిసి జాయింట్‌ బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. అర్హులైన విద్యార్థుల వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు సేకరించి విద్యాశాఖ అధికారులకు నివేదిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు.

ఫ నెలకు రూ.600 చొప్పున ఒక్కొక్కరికి రూ.1,800 నగదు జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement