ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

భానుపురి (సూర్యాపేట) : ఆశావర్కర్లకు రూ.18వేల కనీస వేతనం అమలు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి అండగా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కన్వీనర్‌ నకిరేకంటి కవిత, జిల్లా అధ్యక్షుడు పి.అరుణకుమారి, ఉపాధ్యక్షులు హుస్సేని, ప్రధాన కార్యదర్శి పి.రాధ, కార్యదర్శి సుజాత, విజయ, గోవర్ధన, సబితా, ఉమా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement