భానుపురి (సూర్యాపేట): బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల నుంచి వచ్చిన 22 వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాలల సమస్యలకు పరిష్కారం పొందేలా ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజు, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ నరసింహారావు, బాల సంరక్షణ అధికారి రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


