భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 152 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఐఈఓ సులోచన రాణి, డీవైఎస్‌ఓ వెంకటరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


