చంటి బిడ్డలతో పోరాట బావుటా | - | Sakshi
Sakshi News home page

చంటి బిడ్డలతో పోరాట బావుటా

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

చంటి బిడ్డలతో పోరాట బావుటా

రామగిరి (నల్లగొండ): ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఇద్దరు మహిళలు చంటి బిడ్డలతో హాజర్యయ్యారు. జార్ఖండ్‌ రాష్ట్రం గుమ్లా జిల్లా నుంచి హాజరైన మీలా కుమారి తన మూడు నెలల చిన్నారిని జోలెలో కట్టుకుని మహాసభలో పాల్గొన్నారు. హర్యానాకు చెందిన డింపుల్‌ ఏడాది వయస్సున్న బాలుడితో వచ్చారు. వీరు ఒకవైపు మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు రైతాంగ హక్కుల కోసం గళమెత్తేందుకు అంతదూరం నుంచి వచ్చారు. ప్రజా పోరాటాల్లో మహిళల చైతన్యానికి, అకుంఠిత దీక్షకు కామ్రేడ్‌ మీలా కుమారి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మహాసభలో వారు భాగస్వాములయ్యారు.

చంటి పాపతో జార్ఖండ్‌కు చెందిన మీలా కుమారి

కొడుకుతో సభకు హాజరైన హర్యానాకు చెందిన డింపుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement