డిజిటల్‌ ఉచ్చులో బందీ కారాదు.. | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఉచ్చులో బందీ కారాదు..

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

పాఠశాలల పాత్ర కీలకం

ఫ సోషల్‌ మీడియా ప్రభావంతో

ప్రమాదంలో బాలల మనుగడ

ఫ వీడియో గేమ్‌లతో మైదానాలకు దూరమై.. తగ్గుతున్న సృజనాత్మకత

ఫ పిల్లలకు పెనుముప్పుగా టెక్నాలజీ

ఫ ఫోన్‌లకు దూరమైతేనే చిన్నారుల్లో బోసినవ్వులు

కోదాడ : ఒకప్పుడు చందమామ కథలతో నిద్రపోయిన బాల్యం.. నేడు సోషల్‌ మీడియాతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. చదువులో సృజనాత్మకతకు, లోతైన ఆలోచనలకు పదను పెట్టాల్సిన దశలో.. పాఠశాల హోంవర్క్‌కు సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఆశ్రయించడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం. డిజిటల్‌ తెరల వెలుగులో చిన్నారుల బాల్యం కనుమరుగవుతోంది.

సెల్‌ఫోన్లకు దగ్గరగా..

మైదానాలకు దూరంగా..

ఈ ఉరుకుల పరుగుల కాలంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం క్రమంగా తగ్గుతోంది. సృజనాత్మకతకు పాతరేసి బట్టీ చదువులతో పాటు మార్కులే కొలమానంగా మారిన ప్రస్తుత విద్యావ్యవస్థలో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి చోటు లేకుండా పోయింది. సాంకేతికత తెచ్చిన మార్పులతో చిన్నారులు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయి మైదానాల ఆటలకు దూరమవుతున్నారు. దీంతో వారిలో సోదరభావం కనుమరుగవడంతో పాటు శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. పిల్లలు ఎక్కువగా ఫోన్‌ చూడడం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి వారిని క్రీడా మైదానాల వైపు మళ్లించాలి.

ముందు తల్లిదండ్రులే ఆదర్శం

‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేయదు’ అనే సామెత నేటి తల్లిదండ్రులకు పూర్తిగా వర్తిస్తుంది. పిల్లల ముందు తాము సెల్‌ఫోన్లకు అతుక్కుపోవడం తగ్గించి, వారితో మాట్లాడడం ప్రారంభిస్తే పిల్లలు కూడా క్రమంగా వాటికి దూరమవుతారని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడూ, భోజనం చేస్తున్నప్పుడూ వారిని శాంతపరచడానికి సెల్‌ఫోన్‌ ఇవ్వడం మాని.. నీతి కథలు చెప్పాలని చిన్నపిల్లల మానసిక వైద్యులు చెబుతున్నారు.

ఉపాధ్యాయులను చిన్నారులు రోల్‌మోడల్‌గా భావిస్తారు. ఇంటి తర్వాత ఎక్కువ సమయం బడిలోనే గడుపుతారు. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు వారిపై లోతైన ప్రభావం చూపుతాయి. ఆసక్తికరమైన బోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక పఠనం వైపు వారిని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement