పంటల మార్పిడిని ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

పంటల మార్పిడిని ప్రోత్సహించండి

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

సూర్యాపేట(భానుపురి) : పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వ్యవసాయ, పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏఈఓ క్లస్టర్‌ పరిధిలో ఏ పంటలు సాగు చేయాలి..? ఏయే రకాలను ప్రోత్సహించాలి..? రైతులకు అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు, పెట్టుబడి వ్యయం, మార్కెటింగ్‌ అవకాశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. లక్ష ఎకరాల్లో పంటల మార్పిడి చేపట్టేలా ప్రణాళిక రూపొందించినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజు, డీఆర్‌డీఓ సన్యాసయ్య, సీఎఫ్‌ఓ దామోదర్‌ రెడ్డి, డీఏఓ యాదగిరి, డీఐఈఓ సులోచన రాణీ, డీబీసీడీఓ విశాల్‌, డీఎస్‌ సీడీఓ లతా, మిషన్‌ భగీరథ ఈ ఈ అరుణాకర్‌, ఇంట్రా ఈఈ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమ జీఎం భారతి, అధికారులు పాల్గొన్నారు

ఫ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement