ముప్పని తెలిసినా.. | - | Sakshi
Sakshi News home page

ముప్పని తెలిసినా..

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

నేటి నుంచి అగ్రి షో
ఏఐకేఎస్‌ మహాసభల్లో భాగంగా నల్లగొండలోని క్లాక్‌టవర్‌ వద్ద శనివారం నుంచి అగ్రి షో జరగనుంది.

- 8లో

సాక్షి, నెట్‌వర్క్‌ : సెల్‌ఫోన్‌ వాడకంతో తమ చిన్నారులకు ముప్పు జరుగుతుందని తెలిసినా తప్పనిసరి పరిస్ధితుల్లో సెల్‌ఫోన్‌ ఇస్తున్నామని.. వారి భవిష్యత్తుపై ఆందోళనతో పాటు తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు సెల్‌ఫోన్‌ వాడకంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 మంది తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. తమ పిల్లలు సెల్‌ఫోన్‌ సద్వినియోగం చేసుకోవడం లేదని, వారు ఫోన్‌ వాడకాన్ని తగ్గించడానికి తాము వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నా అవి సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదని వాపోతున్నారు. స్కూల్‌ టీచర్లు హోం వర్క్‌ సెల్‌ఫోన్స్‌కు ఇవ్వడంపై తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. సెల్‌ఫోన్‌ అధికంగా వాడడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తమకు తెలిసినా నియంత్రించడంలో పూర్తిగా సఫలం కాలేక పోతున్నామని ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ నిస్సహాయత వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement