సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : నేరాల నియంత్రణకు రాత్రివేళ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు నిఘా కట్టుదిట్టం చేయాలని ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోదాడ డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టు కేసులు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించి వారి నేర చరిత్రను పరిశీలించాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై డిజిటల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర నిఘా ఉంచాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ రవాణాను అరికట్టాలని, సీసీ కెమెరాల ఏర్పాటును పెంచాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


