కోదాడ: ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కేవలం కరువు ప్రకటన చేసి చేతులు దులుపుకుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. గురువారం కోదాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఆయా మండలాల్లో పంట నష్టపోయిన రైతులను నేటికీ గుర్తించలేదన్నారు. ఐకేపి కేంద్రాలను ప్రారంభించకపోవడంతో మిల్లర్లు కనీస ధర చెల్లించడం లేదన్నారు. సమావేశంలో ఎస్‌కే నయీం, కందిబండ సత్యం, ఉపేంధర్‌రావు, కిరణ్, నర్సిరెడ్డి, అబ్బు, కరీముల్లాబాబా పాల్గొన్నారు.


