ఎదురుచూపులు ఫలించాయి | - | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు ఫలించాయి

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

భానుపురి (సూర్యాపేట) : చాలాకాలం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఇక చేయూత పింఛన్లు అందించడమే మిగిలింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 19వేలకు పైగా కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అన్ని మండలాలకు పింఛన్‌ పొందనున్న అర్హుల జాబితాలను ఉన్నతాధికారులు అందించారు. ఈనెల 18వ తేదీ నాటికి పింఛన్‌ పొందే ప్రతి ఒక్కరికీ మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు. ఇందుకుగాను నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం కోదాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి చేతుల మీదుగా అర్హులకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు.

21,338 దరఖాస్తులకు గాను..

నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం ఆగస్టు 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులోనూ ఏడురకాల పింఛన్లకే (వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు) అవకాశం కల్పించింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆయా రకాల పింఛన్లకు 21,338 దరఖాస్తులు అందాయి. పంద్రాగస్టు నాటికి పరిశీలన పూర్తి చేసి సెప్టెంబర్‌ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా అన్నిరకాల పింఛన్లు దాదాపు 1,56,000 మందికి ప్రతినెలా అందుతున్నాయి.

సిద్ధమైన కొత్త పింఛన్ల

మంజూరు పత్రాలు

ఈనెల 18 వరకు అందరికీ

అందించేలా ఏర్పాట్లు

నేడు కోదాడలో పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే పద్మావతి

జిల్లాలో కొత్తగా మంజూరైన

పింఛన్లు 19,384

19,384 పెన్షన్లకు ఆమోదం

అర్హులకే పింఛన్‌ అందాలన్న ఆలోచనతో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంది. గతంలో మాదిరిగా కాకుండా దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరిగింది. అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అన్నికోణాల్లోనూ విచారణ జరిపించింది. ఆధార్‌ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, వాహనాలు అన్నింటిని సేకరించి.. జిల్లాస్థాయి అధికారులతో నేరుగా విచారణ జరిపించడంతో కొంత ఆలస్యమైంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 19,384 పెన్షన్లకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఇంకా వివిధ దశల్లో ఏమైనా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే ఈనెల 16వ తేదీ నాటికి పూర్తి చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఈ క్రమంలో ఇంకా పింఛన్ల సంఖ్య పెరిగే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement