పశుగ్రాసం సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం సాగుకు ప్రోత్సాహం

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

ఎన్‌ఎల్‌ఎం పథకం కింద రూ.55 వేల సబ్సిడీ

గుర్రంపోడు : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గ్రామస్థాయిలో ప శుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయాలని స్పంకల్పి చింది. ఇందుకోసం కేంద్రం వీబీ జీ రాంజీ కార్యక్రమ వ్యయంలో కనీసం ఐదుశాతం నిధులు వెచ్చించేలా అనుమతించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ద్వారా వ్యక్తిగత పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తోంది. ఎండుగడ్డి కొరతను అధిగమించేలా వ్యవసాయ భూమి ఉండి, నీటిపారుదల సౌకర్యం గల పాడి రైతులకు పశుగ్రాసం పెంపకానికి ఆర్థికసాయం అందించనుంది.

ఎకరా పశుగ్రాసం సాగుకు రూ.14,023

ఒక ఎకరంలో పశుగ్రాస సాగుకు విత్తనాలు, కంచె, కూలీల ఖర్చులు, ఎరువులు, కోత కూలీలు అన్నీ కలుపుకుని మెటీరియల్‌ ఖర్చు రూ.3,551, కూలీ ఖర్చు రూ.10,475లుగా అంచనా వేసి యూనిట్‌గా మొత్తం రూ.14,023లను నేరుగా రైతు ఖాతాలో జమచేస్తారు. ఉపాధి కూలీలతోగాని, రైతు జాబ్‌కార్డు కలిగి సొంతంగా పని చేసుకుంటే వారి ఖా తాల్లోనే కూలీ డబ్బులు ఉపాధిహామీ పథకం కింద జమచేస్తారు. పశుగ్రాస పంటలైన నేపియర్‌ గడ్డి, మొక్కజొన్న, జొన్న, గినియా, లూనేగ్న్‌ వంటి హై బ్రిడ్‌ జాతి పశుగ్రాసాలు సాగు చేయాల్సి ఉంటుంది.

తొలుత గ్రామానికి ఐదు యూనిట్లు

పాడి రైతుల్లో అవగాహన కల్పించి ప్రతి గ్రామానికి కనీసం ఐదు యూనిట్లు ముందస్తుగా ఎంపిక చేయాలని నిర్ధేశించింది. ఎంతమంది రైతులకై నా పరిమితి లేకుండా యూనిట్లు మంజూరు చేసి పశుగ్రాస అభివృద్ధికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. కరువు పరిస్థితుల్లో పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందించడం వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పాల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు వేసవిలో అధిక మొత్తంలో పశుగ్రాసంకు ఖర్చు చేసే సమస్య ఉండదు.

గ్రామానికి రెండు నీటి తొట్టెలు

వేసవిలో మూగజీవాలు తాగు నీటి సమస్యను అధిగమించేందుకు ప్రతి గ్రామంలో ప్రధాన రహదారుల వెంట రెండు నీటి తొట్టెలు నిర్మించనున్నారు. ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి రూ.35 వేల ఖర్చును అంచనా వేసి ఉపాధి పథకంలో చేపడతారు. గ్రామ పంచాయతీ నీటి తొట్టె నిర్మాణ భాద్యతతోపాటు పైపులైన్‌ వేయడం, నీటి తొట్టెను నింపే భాద్యత వహించాల్సి ఉంటుంది.

అర్హతల మేరకే రాయితీ..

పశుగ్రాసం సాగు కోసం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన రాయితీని రైతు ఖాతాలో జమ కావు. గ్రామ పంచాయతీ తీర్మాణం, జాబ్‌కార్డు, పశువులతో కలిసి రైతు దిగిన ఫోటో, భూమి పట్టా పాస్‌పుస్తకంతో దరఖాస్తు చేసుకుంటే పశువైద్యాధికారి అనుమతి మంజూరు పత్రం జారీచేస్తారు. ఆ తర్వాత ఎంపీడీఓ, ఏపీఓ పశుగ్రాస క్షేత్రాలను పరిశీలించి రాయితీ అందిస్తారు.

ఫ మూగజీవాల మేత నివారణకు కేంద్రం చర్యలు

ఫ వీబీ జీ రాంజీ కింద పచ్చిమేత సాగు చేసేలా ప్రణాళిక

ఫ పాడి రైతులకు ఆర్థిక చేయూత

పశుసంవర్ధక శాఖ ద్వారా ఇప్పటికే అమలులో ఉన్న నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ స్కీం (ఎన్‌ఎల్‌ఎం)ను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎకరం భూమిలో మూడేళ్ల పాటు వరుసగా పశుగ్రాసం సాగు చేస్తాననే హామీతో రైతులకు దశలవారీగా రూ.55 వేల రాయితీ మొత్తాన్ని అందిస్తారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement