సమ్మేళనానికి ఎంజీయూ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

సమ్మేళనానికి ఎంజీయూ ముస్తాబు

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

నల్లగొండ టూటౌన్‌ : దక్షిణ భారత చరిత్రకు సంబంధించిన నూతన పరిశోధనలు, చారిత్రక అంశాలపై చర్చించేందుకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు 45వ సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్రకారులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ సదస్సుకు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. విశ్వవిద్యాలయ చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి సదస్సు పరిశోధనలకు ప్రోత్సాహం అందించడంతోపాటు ఉన్నత విద్యారంగంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ గుర్తింపును మరింత పెంచనుందని వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ షేక్‌ మస్తాన్‌ ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. సదస్సులో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక చరిత్ర అంశాలపై ఎనిమిది ప్యానెళ్లలో పరిశోధన పత్రాల సమర్పించి, చర్చలు నిర్వహించనున్నారు.

తెలంగాణ చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం

దక్షిణ భారత చరిత్రలోని పలు కీలక ఘట్టాలు, నూతన పరిశోధనలపై చర్చించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విక్టర్‌బాబు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణతోపాటు నల్లగొండ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిణామాల అధ్యయనానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా చరిత్ర పరిశోధకుల మధ్య భావ వినిమయం, కొత్త పరిశోధనలకు మార్గం సుగమం కానుంది.

మూడు రోజుల కార్యక్రమాలు ఇలా..

Æ మొదటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ ఉంటుంది.

స్వాగతించేవారు : ప్రొఫెసర్లు అంజిరెడ్డి, విజయబాబు.

ప్రారంభించేది : వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌.

ముఖ్య అతిథి : తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి.

సభ అధ్యక్షత : ప్రొఫెసర్‌ ఎస్‌.విక్టర్‌ బాబు.

44వ సదస్సు ప్రొసీడింగ్స్‌, పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. ఉత్తమ పరిశోధనా పత్రాలకు అవార్డుల ప్రదానం, ప్రముఖులను సన్మానిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు వివిధ విభాగాల్లో పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు ఎండోమెంట్‌, మెమోరియల్‌ ఉపన్యాసాలు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి.

Æ రెండో రోజు శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం. 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరిశోధనా పత్రాల సమర్పణ. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం. తిరిగి 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశోధనా పత్రాల సమర్పణ.

Æ మూడో రోజు ఆదివారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు అల్పాహారం. 8.30 నుంచి 11 గంటల వరకు పరిశోధనా పత్రాల సమర్పణ. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు ముగింపు సభ. ముగింపు సభకు ప్రొఫెసర్‌ కె.అంజిరెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్‌ కె.అరుణప్రియ అధ్యక్షత వహిస్తారు. ముఖ్య వక్తగా ప్రొఫెసర్‌ బంగ్యా బుక్యా పాల్గొంటారు.

ఫ యూనివర్సిటీలో నేటి నుంచి

సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌

ఫ మూడు రోజులపాటు

జాతీయ స్థాయి సదస్సు

ఫ దేశవ్యాప్తంగా తరలిరానున్న

చరిత్రకారులు, పరిశోధకులు

ఫ 8 ప్యానెళ్లలో పరిశోధన పత్రాల సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement