ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

సూర్యాపేట (సూర్యాపేటటౌన్‌) : ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, పెండింగ్‌ కేసులకు పరిష్కారం చూపాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నరసింహ సూర్యాపేట డిజనల్‌ పరిధి పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్‌ కేసుల ఛేదన, నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గ్రేవ్‌ కేసుల్లో శాసీ్త్రయ ఆధారాలను సేకరించి, నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్‌ పథకం కింద సూర్యాపేట జిల్లాలో 38 ఆస్పత్రులను గుర్తించామని, ప్రమాద బాధితులకు ఉచిత అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించి, అత్యవసర సమయాల్లో తక్షణమే వినియోగించుకునేలా సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. విధి నిర్వహణకు అవసరమైన కమ్యూనికేషన్‌ సెట్‌, ఎమర్జెన్సీ కిట్లు వాహనాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్‌, సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ డీఎస్పీ రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ మగ్దుం అలీ, జిల్లా ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వరరావు, వెంకటయ్య, ఉపేందర్‌ రావు, రాజశేఖర్‌, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement