మూడేళ్లు గడిచినా హామీలు అమలు కాలేదు | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లు గడిచినా హామీలు అమలు కాలేదు

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

సూర్యాపేట : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆశా కార్యకర్తలను మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మె సందర్భంగా గురువారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి సూర్యాపేట క్యాంప్‌ కార్యాలయంలో వారు సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్‌ రూ.50లక్షలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు, రిటైర్మెంట్‌ తరువాత వేతనంలో 50శాతం పెన్షన్‌, ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ప్రభుత్వం ప్రకటించిన రెండు డీఏలను ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి కనీస వేతనంతో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓకు ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, పచ్చిపాల ఉపేందర్‌, మేకల జయమ్మ, ఽనకిరేకంటి కవిత, సీత, విజయ, అరుణ, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement