మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీదుల్లో ఊరేగించారు. కార్తీక మాసం సందర్భంగా మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.
సూర్యాపేటకు రైలు మార్గం లేకపోవడం బాధాకరం
సూర్యాపేట : సూర్యాపేటకు రైలు మార్గం లేకపోవడం బాధాకరమని రైల్వే సాధన సమితి సభ్యుడు అన్నారు. ఈమేరకు గురువారం ప్రధాన మంత్రికి పోస్టుకార్డులను పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యాపేటకు రైలు మార్గం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్ , కో కన్వీనర్ రాచూరి ప్రతాప్, బుద్ధ శ్రీనివాస్, రాపర్తి చిన్న సైదులు, అంజి, గురుస్వామి, రాజు, శ్రావణ్ కుమార్, మౌనిక, మమత తదితరులున్నారు.


