సూర్యాపేట టౌన్ : విద్యార్థుల్లో సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, వారిలోని సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యక్తీకరణ నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘రోల్‌ప్లే’ పోటీలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదల, భావోద్వేగ శ్రేయస్సు, మానసిక ఆరోగ్యం, వ్యక్తుల మధ్య సంబంధాలు, లింగ సమానత్వం, పోషకాహారం, పరిశుభ్రత, మాదకద్రవ్యాల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, హెచ్‌ఐవీ నివారణ, ఇంటర్నెట్, గాడ్జెట్ల సురక్షిత వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచినవారికి డీఈఓ శ్రీనివాసరావు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ఎల్.దేవరాజ్, బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ, జ్యూరీ సభ్యులు అనిల్, శ్రీధర్ పాల్గొన్నారు.
డీఈఓ శ్రీనివాసరావు


