పిల్లల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట | - | Sakshi
Sakshi News home page

పిల్లల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పిల్లల హక్కుల పరిరక్షణ, వారి స్వేచ్ఛ, అభిరుచులు, ఆలోచనా విధానంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌ సంస్థతో జిల్లా యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్పీ నరసింహ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాలలు తమ హక్కులను, స్వేచ్ఛను పూర్తిస్థాయిలో అనుభవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ అవగాహన ఒప్పందం సూర్యాపేటను ఆదర్శ బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనిసెఫ్‌ ప్రతినిధి ఫిలిప్స్‌, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి.రవికుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఉపేంద్ర, సీడీపీవోలు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement