ఏపీకి విద్యుత్‌ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

ఏపీకి విద్యుత్‌ సిబ్బంది

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

కోదాడ రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రళయం సృష్టించిన తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు సూర్యాపేట జిల్లా విద్యుత్‌ సిబ్బంది గురువారం భీమవరం బయలుదేరారు. ఏపీలో తుపానుతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 మంది సిబ్బంది అక్కడికి వెళ్లారు. జిల్లా నుంచి 10 మంది ఏఈలు, కాంట్రాక్టర్లు, కార్మికులు, ఇతర విద్యుత్‌ సిబ్బందితో పాటు 10 వర్కింగ్‌ ట్రాక్టర్లు బయలుదేరి వెళ్లాయి. ఈ వాహనాలను జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ యాదగిరి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్నికల్‌ డీఈ వెంకటకృష్ణయ్య, ఎంఆర్‌టీ డీఈ జ్యోతికుమార్‌, ఏడీఈలు వెంకన్న, ఆనంద్‌, మధు, బాలకృష్ణ, విద్యుత్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement