4న బహిరంగ వేలం | - | Sakshi
Sakshi News home page

4న బహిరంగ వేలం

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

సూర్యాపేట టౌన్‌ : జిల్లా పోలీస్‌ శాఖలో నిరుపయోగంగా ఉన్న వివిధ రకాల వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ కె.నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెంట్‌ సామగ్రి, ఫైబర్‌ ప్లాస్టిక్‌, ఇనుప సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 4న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న పాత ఎస్పీ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు వేలం ప్రక్రియలో పాల్గొని, నిబంధనల ప్రకారం వస్తువులను కొనుగోలు చేయవచ్చని సూచించారు. వివరాలకు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సెల్‌ నంబర్‌ 87126 86018 సంప్రదించవచ్చని తెలిపారు.

చిన్నారులను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచండి

చివ్వెంల(సూర్యాపేట) : చిన్నారులను తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్‌ పి.శివరామ్‌ ప్రసాద్‌ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం చివ్వెంల పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)–2012 పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం కోర్టుల ముందుకు వస్తున్న కేసుల్లో అత్యధికంగా 18 సంవత్సరాలలోపు పిల్లలకు సంబంధించినవే ఉంటున్నాయని తెలిపారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌ అతిగా ఉపయోగించడం వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్‌ సభ్యుడు గుంటూరు మధు, ప్రిన్సిపాల్‌ జి.పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

నూతన పెన్షన్ల పరిశీలన

చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛనుదారుల వివరాలను డీఆర్‌డీవో సన్యాసయ్య గురువారం పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ) సీహెచ్‌.సంతోష్‌ కుమార్‌, ఏపీఎం వెంకటయ్య, సర్పంచ్‌ గోగుల ఈదయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ నాయక్‌, సీసీ చందు నాయక్‌ పాల్గొన్నారు.

జిల్లా ఆదర్శ రైతుగా మూల వెంకటరెడ్డి

మునగాల : మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామానికి చెందిన మూల వెంకటరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో ఆయన అందిస్తున్న సేవలు, ఆధునిక సాగు పద్ధతులను అనుసరిస్తున్నందుకు గాను వెంకటరెడ్డిని సూర్యాపేట జిల్లా ఆదర్శ రైతుగా ఎంపిక చేశారు. కిసాన్‌ మహారాజా అవార్డ్స్‌–2026 పేరిట వైస్‌ టీవీ డిజిటల్‌ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆదర్శ రైతులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ శి ల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటరెడ్డికి ఆదర్శ రైతు అవార్డును ప్రదానం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, వైస్‌ టీవీ యాంకర్‌ రాములమ్మ తదితరులు వెంకటరెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి షీల్డు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement