సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ సాధనే ధ్యేయంగా అందరూ కలిసి కట్టుగా ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహులు పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 47వ రోజు కొనసాగాయి. దీక్షలకు వారు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమాలను ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మొదటి అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్షలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి సభ్యులు వెలుగు వనిత, సట్టు నాగయ్య, భూపతి రాములు గౌడ్, కందుకూరి యాదగిరి, రవీందర్ నాయక్, యర్కచర్ల శోభారాణి, నాగవెల్లి కరుణాకర్, కొమాండ్లపల్లి సుజాత, మామిడి శెట్టి అంజన్న, పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ డీఎం భయ్యా మల్లికార్జున్, ఎర్ర అఖిల్ సంఘీభావం తెలిపారు.


