కోదాడలో హైటెక్‌ బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కోదాడలో హైటెక్‌ బస్టాండ్‌

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

మెరుగైన వసతులు కల్పిస్తాం

కోదాడ బస్టాండ్‌లో ప్రయాణికులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తాం. కోదాడ బస్టాండ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మిస్తాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులు చేస్తాం. నిర్మాణం పూర్తి అయిన తరువాత పాత వ్యాపారులకు తగిన ప్రాధాన్యత ఇస్తాం. ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తాం.

– నలమాద పద్మావతి, ఎమ్మెల్యే కోదాడ

కోదాడ: కోదాడ పట్టణంలో నూతన ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత బస్టాండ్‌ ఆవరణలోనే రూ.17 కోట్లతో కొత్తదానిని నిర్మించనున్నారు. ఇందుకోసం టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రెండు రోజులుగా పాత భవనాలను కూల్చివేసే పనులు చేపడుతున్నాడు. కొత్త బస్టాండ్‌ నిర్మాణం పూర్తి అయ్యే వరకు బస్సుల రాకపోకలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక బస్టాండ్‌ నిర్మాణం చేస్తున్నారు.

ఆధునిక హంగులతో ..

విజయవాడ– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌ సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. బస్సులతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో బస్టాండ్‌ ఇరుకుగా మారింది. దాంతో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని కోదాడకు తీసుకొచ్చి నూతన బస్టాండ్‌ నిర్మాణానికి హామీ తీసుకున్నారు. నాలుగు నెలల క్రితం మంత్రులు బస్టాండ్‌ నిర్మాణానికి శంఖుస్ధాపన కూడా చేశారు.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

ప్రస్తుతం బస్టాండ్‌ నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా మూడు అంతస్తులతో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ముందుగా బస్టాండ్‌ నిర్మించిన తరువాత జాతీయ రహదారి వైపు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయనున్నారు. ఇందులో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఈ నిర్మా ణం పూర్తయితే కోదాడకు నూతన కళ రానుంది.

కూల్చివేతలతో వ్యాపారులకు ఇబ్బందులు

బస్టాండ్‌ నిర్మాణంతో బస్టాండ్‌ లోపల, వెలుపల ఉన్న దుకాణాల సముదాయాలను కూల్చి వేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బస్టాండ్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు తాము అడ్డుగా లేమని, నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభమయ్యే వరకు ప్రస్తుతం ఉన్న దుకాణాల నుంచి తమను ఖాళీ చేయించ వద్దని వారు కోరుతున్నారు.

ఫ రూ.17 కోట్లతో

ఆధునికంగా నిర్మాణం

ఫ ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement