కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరు ఖరారైంది. మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం మంగళవారం రాత్రి ఖరారు చేసింది. దామోదర్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సర్వోత్తమ్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ఆయనకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి సూర్యాపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేశారు. అనంతరం ఆయన మృతి చెందడంతో దామోదర్‌రెడ్డి వారసుడికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సర్వేల తరువాత సర్వోత్తంరెడ్డి పేరు ఖరారు..

అధికార పార్టీలో ఆశావహులపై కాంగ్రెస్‌ పార్టీ సర్వే చేయించింది. ఆశావహులు కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు. ఎవరిని పోటీలో నిలిపితే బాగుంటుందన్న దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, పున్నా కై లాష్‌ నేత, పటేల్‌ రమేష్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా నుంచి సింగారపు ఇందిర, దొమ్మాటి సాంబయ్య, ఖమ్మం జిల్లా నుంచి లోకేష్‌ యాదవ్‌ పేర్లతో సర్వే చేయించింది. చివరకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి పేరును ఖరారు చేసింది.

రెండు చోట్లా రెడ్లకే ప్రాధాన్యం

ఈ స్థానంలో ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలన్న విషయలో చర్చ చేసింది. హైదరాబాద్‌ –రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానంలో బీసీని పోటీలో నిలిపితే వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానంలో ఓసీకి ఇవ్వాలని, ఇక్కడ బీసీకి ఇస్తే, అక్కడ ఓసీ అభ్యర్థిని బరిలో దింపాలని గతంలో ఆలోచన చేసింది. కానీ, చివరకు కాంగ్రెస్‌ పార్టీ రెండు చోట్లా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే ఖరారు చేసింది.

ఫ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థినిఖరారు చేసిన అధిష్టానం

ఫ మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కుటుంబానికి దక్కిన గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement