భానుపురి(సూర్యాపేట) : అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాలల సంరక్షణపై చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్, బాల్య వివాహాలు లేని గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ – అధికారుల పాత్రపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో బాలల సంరక్షణ, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, సామాజిక వ్యవస్థలు పిల్లలపై చూపుతున్న ప్రభావంపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్ ఫిలిప్సే, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అనూష, టి.వసంత్, డీడబ్ల్యూఓ నరసింహారావు, బీసీ సంక్షేమ అధికారి విశాల్ ధార, ఆర్టీఓ పురుషోత్తంరెడ్డి, డీఐఈఓ సులోచనారాణి, అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్
ఈడీగా ఉపేందర్‌రావు
భానుపురి(సూర్యాపేట) : ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాగి ఉపేందర్‌రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్ల పక్కన, కల్వర్టుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలలు, ఆట స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రణాళిక ప్రకారం కేసుల దర్యాప్తు
కేసుల దర్యాప్తులో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనలను పాటించాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించారు.


