కోదాడ: ప్రజాస్వామ్య దేశంలో నియంతలకు చోటు లేదని, నియంతలా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువ రోజులు పాలన సాగించలేరని, ఆయన ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాల నోరు నొక్కడానికి ప్రయతించడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో కోదాడ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కే. నయీం, సంపెట ఉపేందర్, ఇమ్రాన్‌ఖాన్, అబ్బు, తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్


