ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ (70 మార్కులు), ప్రత్యేక కేటగిరీల ప్రాధాన్యత (వితంతువులకు 10 మార్కులు, అనాథలకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు), జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలు (10 మార్కులు) ప్రాతిపదికగా, రోస్టర్ నిబంధనలను పాటిస్తూ ఈ తాత్కాలిక జాబితాను సిద్ధం చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయితే అంగన్‌వాడీల్లో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలు మరింత మెరుగ్గా అందుతాయని, అలాగే ప్రస్తుత సిబ్బందిపై ఉన్న పనిభారం తప్పుతుందని భావిస్తున్నారు.
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం వేగంగా కసరత్తు పూర్తిచేసి తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది. దాదాపు మూడు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 131 ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో, జిల్లా యంత్రాంగం ఈ ఏడాది జూలై 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు తాజాగా తాత్కాలిక ఎంపిక జాబితాను రూపొందించారు. ఈ జాబితాను సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాలు, సీడీపీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో రాతపూర్వకంగా అందజేయాలని జిల్లా అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది జాబితాను వెల్లడించనున్నారు.
జిల్లాలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో సూర్యాపేట అర్బన్, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ ప్రాజెక్టుల కింద మొత్తం 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల 67 టీచర్, 64 ఆయా పోస్టులు ఖాళీగా మారాయి. గతంలో పలుమార్లు నియామక ప్రక్రియ వేగవంతమైనట్లే కనిపించి వాయిదా పడుతూ వచ్చింది. కాగా.. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ వేగం అందుకుంది.
ఫ అంగన్‌వాడీ పోస్టుల తాత్కాలిక జాబితా విడుదల చేసిన అధికారులు
ఫ ఈ నెల 11వ తేదీ వరకు
అభ్యంతరాల స్వీకరణ
ఫ అనంతరం తుది జాబితా వెల్లడి
ఫ భర్తీతో తీరనున్న సిబ్బంది కొరత


