సూర్యాపేట కొత్త మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మాది అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్‌లో నీటి సమస్య తలెత్తకుండా దోసపహాడ్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 9 నుంచి 10 వాటర్ ట్యాంకులను నింపి పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడిందని, ఈ విషయమై మూసీ అధికారులతో మాట్లాడి సద్దుల చెరువును నింపినట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్‌కు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం తెలిపారు. బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పెత్తనం చేస్తున్నారని, అలాంటి జోక్యాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హనుమంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఈఈ కిరణ్, పబ్లిక్ హెల్త్ డీఈలు రమాదేవి, అనిల్, ప్రణయ్ రెడ్డి, మేనేజర్ బుచ్చిబాబు, ఆర్వో జ్ఞానేశ్వరి, గౌస్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు
అనుసంధాన రహదారి నిర్మాణం
ఫ దోసపహాడ్ ప్రాజెక్టు పునరుద్ధరణకు
కసరత్తు
ఫ మిషన్ భగీరథ నీటి సరఫరా
లోపాల సవరణ
ఫ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట


