అసెంబ్లీలో దళితుల
సమస్యలపై చర్చించాలి
సూర్యాపేట అర్బన్ : శాసనసభ సమావేశాల్లో చేవెళ్ల డిక్లరేషన్ ఆధారంగా దళితుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్‌లో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్పీకర్‌పై పరుష పదజాలంతో మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రెమిడాల పరశురాములు, జిల్లా ఉపాధ్యక్షుడు టేకుల సుధాకర్, ఇరుగు రమణ, నందిగామ సైదులు, డి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


