అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని 302 చిత్తడి నేలల క్షేత్రస్థాయి పరిశీలన, సరిహద్దుల నిర్ధారణను ఆయాశాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో చిత్తడి నేలల కమిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి చిత్తడి నేలల నోటిఫికేషన్‌ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. చిత్తడి నేలలు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, పులిచింతల రిజర్వాయర్‌, మూసీ ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ల పరిధిలో ఉన్న చిత్తడి నేలలను కూడా నోటిఫై చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, జిల్లా అటవీ అధికారి దామోదర్‌రెడ్డి, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ వేణుమాధవ్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement