నాకు ఎంజీనగర్ శివారులో 148/ఆ సర్వే నెంబర్‌లో వారసత్వంగా వచ్చిన 12 గుంటల భూమి ఉంది. కొందరు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను భూమిలోకి రానివ్వడం లేదు. రోడ్డు వెంట ఉండటంతో నీ భూమి రోడ్డుకు పోయిందని, నీకు ఇక్కడ లేదని భయ పెడుతున్నారు. రోడ్డుకు పోతే నాకు నోటీస్ రావాలి. అలాంటిదేమీ రాలేదు. సమస్యను వివరించేందుకు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్ డేకు వచ్చాను. సమస్యను త్వరగా పరిష్కరించాలి.
–రత్నావత్ నాగరాజు, ఎంజీనగర్ తండా, చివ్వెంల మండలం


