ప్రజావాణి పట్టదా.. | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి పట్టదా..

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

ప్రజావాణి దరఖాస్తులను

పెండింగ్‌ పెట్టొద్దు

సూర్యాపేట : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నారు. ప్రతి వారం వందలాది మంది బాధితులు గ్రీవెన్స్‌కు వచ్చి తమ ఇబ్బందులు అధికారులకు తెలిపి, వాటిని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. అయినా బాధితులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగడం లేదు. సమస్య పరిష్కారం కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పలుమార్లు దరఖాస్తులు సమర్పిస్తున్నా కొన్ని సమస్యలు మాత్రం పెండింగ్‌లోనే ఉంటున్నాయి. సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌న్స్‌డేకు 66 మంది బాధితులు దరఖాస్తులు అందించారు.

నాలుగైదు సార్లు దరఖాస్తులు

తమ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశతో బాధితులు ఇప్పటికే నాలుగైదు సార్లు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో దరఖాస్తులు సమర్పించినట్లు చెబుతున్నారు. ప్రతిసారి దరఖాస్తు స్వీకరించి సంబంధిత శాఖకు పంపుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందిస్తున్నారు. అయితే గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపడంతో పాటు సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌ పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌ బాబు, డీడబ్ల్యూఓ నరసింహారావు, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఫ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కాని సమస్యలు

ఫ తరచూ కలెక్టరేట్‌కు వస్తున్న

బాధితులు

ఫ సోమవారం 66 దరఖాస్తులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement