బుల్లెట్‌ రైలు వచ్చే వరకు ఉద్యమం ఆగదు | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు వచ్చే వరకు ఉద్యమం ఆగదు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సూర్యాపేట మెకానిక్‌ సంఘం అధ్యక్షుడు రాదేని ఆదినారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట ఆటోనగర్‌లోని అన్ని యూనియన్‌ల నాయకులు కలిసి బుల్లెట్‌ ట్రైన్‌ సాధన ఉద్యమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి సోమ్లనాయక్‌, కోశాధికారి సలీం, కడారి వెంకన్న, బాలయ్య, నాగిరెడ్డి, మల్లయ్య, రాంబాబు, జానిమియా, తదితరులు పాల్గొన్నారు.

ప్రధానికి పోస్టు కార్డులు

సూర్యాపేట : సూర్యాపేటకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్ష పోస్ట్‌కార్డులు పంపాలన్న లక్ష్యంతో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం శ్రీపోస్ట్‌కార్డు ఉద్యమంశ్రీ చేపట్టారు. వాణిజ్య భవన్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్డులపై సంతకాలు చేశారు. రైల్వే ఉద్యమానికి సుదీర్ఘకాలంగా గొంతుకగా నిలిచిన 90 ఏళ్ల మంచాల రంగయ్య కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత తొలి పోస్ట్‌కార్డుపై సంతకం చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, నాయకులు సంఘీభావం తెలి పారు. తొలి రోజే 2 వేల పోస్ట్‌కార్డులు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్‌ డేగల జనార్దన్‌, జేఏసీ చైర్మన్‌ చింతలపాటి చిన్న శ్రీరాములు, కో–కన్వీనర్‌ రాచూరి ప్రతాప్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో

కొనసాగుతున్న దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement