కోదాడ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు, అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ సోమవారం కోదాడ బస్టాండ్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులతో అడ్డుకోవడంతో పాటు వారిపై భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని పేర్కొన్నారు. పాలన చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కే. నయీం, చీమ నరేష్, కరీముల్లాబాబా, పిట్టల భాగ్యమ్మ, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్యగౌడ్, సంపెట ఉపేందర్, అల్వాల వెంకట్, మజహర్, ఎస్‌కే. అబ్బు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయరహదారిపై రాస్తారోకో
సూర్యాపేటటౌన్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని అంజనాపురి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ తీరు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని రాస్తారోకోను విరమింప జేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు వైవీ, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, అన్నపూర్ణ, భిక్షం, తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం


