సూర్యాపేటటౌన్ : ప్రమోషన్‌తో బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్‌లో ఆర్‌ఎస్‌ఐలుగా విధులు నిర్వర్తిస్తున్న టి. రాజశేఖర్, కె.అశోక్ లు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ప్రమోషన్ పొందిన అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆ ఇరువురిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి స్టార్స్ ధరింపజేసి ప్రమోషన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యం
సూర్యాపేటటౌన్ : శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీప మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ కి సూచనలు చేశారు.
ఫ ఎస్పీ నరసింహ


