12న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

చివ్వెంల(సూర్యాపేట) : ఈ నెల 12న సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద కోరారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు, పీపీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సూర్యాపేట, కోదాడ, హూజూర్‌నగర్‌, తుంగతుర్తి కోర్టుల్లోనూ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాంప్రసాద్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంచాల మమత, అడిషనల్‌ ఎస్‌పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.

ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement