మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు, మధ్యాహ్నం 12గంటలకు తీర్థప్రసాదాలు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణుడికి పొన్నవాహన సేవతోపాటు పెదవీడుకు చెందిన యాదవుల ఆధ్వర్యంలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా నివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.


