భానుపురి (సూర్యాపేట) : బీజేపీ కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవంపై ప్రశ్నిస్తే కేసు పెట్టడం బీజేపీ మార్కు ప్రజాస్వామ్యంగా మారిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


