కరెంట్‌ కోతలపై అన్నదాతల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలపై అన్నదాతల ఆగ్రహం

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

మోతె : వ్యవసాయానికి కోతలు లేని విద్యుత్‌ను అందించాని డిమాండ్‌ చేస్తూ మోతె, బీక్యతండా గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం లాల్‌తండా సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువలేదని, కరెంట్‌ కూడా సక్రమంగా సరఫరా చేయక పోవడంతో తాము సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోఓల్టేజీ సమస్యతో విద్యుత్‌ మోటర్లు కాలిపోతున్నాయన్నారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, మోతె మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు కొమ్ము లింగరాజు, ఇండ్ల వెంకటేశ్వర్లు, సురేష్‌, గణేష్‌, ఉపేందర్‌, దేవుల, ఇండ్ల శ్రీను, రామోజీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement