భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, డిజిటల్ విద్యా విధానం, పాఠశాలల పర్యవేక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే మిడ్‌లైన్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి కనీసం 70 శాతం అభ్యాసన సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా శ్రీఅకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్‌శ్రీలో తమ పరిశీలనలను, సూచనలను నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ అశోక్, వివిధ విభాగాల సెక్టోరల్ అధికారులు, డీఆర్డీఓ సన్యాసయ్య, ట్రైనీ కలెక్టర్లు రవితేజ, అనూష, ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర కోఆర్డినేటర్ అభిషేక్ శ్రావణ్‌కుమార్, హరికృష్ణ పూలన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


